మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

మంత్రి లోకేష్ పర్యటనలో.. అంగన్వాడీల నిరసన

27 జులై, 2026

Anganwadi workers protest during Minister Lokesh's visit.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 03:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పెనమలూరు (కృష్ణా) : పెనమలూరులో మంత్రి నారా లోకేష్ పర్యటనలో అంగన్వాడీలు నిరసన చేపట్టారు. సోమవారం తమ సమస్యలను తెలిపేందుకు పునాదిపాడు వద్దకు అంగన్వాడీలు చేరుకున్నారు. మంత్రి లోకేష్ వెళ్లే మార్గంలో వారంతా నిరసన తెలుపుతుండగా .... కాన్వాయ్ ఆపకుండా నారా లోకేష్ వెళ్లిపోవడంతో అంగన్వాడీలంతా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అంగన్వాడీలకు జీతాలు పెంచుతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, జీతాలు పెంపు చేయాలని అడిగేందుకు వచ్చిన తమకు నిరాశే మిగిలిందని అంగన్వాడీలు వెనుతిరిగారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్