ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్ స్టేజ్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ మూడు గోల్స్ చేయగా, శిలానంద్ లక్రా రెండు గోల్స్‌తో సత్తా చాటాడు.
పూల్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరిన భారత జట్టు.. అక్టోబర్ 1న పాకిస్తాన్‌తో సెమీఫైనల్‌లో తలపడనుంది.








కామెంట్‌లు (0)