బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాను బీభత్సం

1 గంట క్రితం

Cyclone Devastation
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 04:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

జలమయమైన రహదారులు..

స్తంభించిన జన జీవనం


కృష్ణా : అర్నబ్ తుఫాను భీభత్సం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ఈదురుగాలులు, వర్ష తీవ్రత అధికంగా ఉంది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో జన జీవనం స్తంభించిపోయింది. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో తుఫాను ప్రభావంతో నగరంలోని ఎస్పీ కార్యాలయం పరిసరాలు, ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌, కలెక్టర్‌ బంగ్లా, లక్ష్మీ టాకీస్‌ సెంటర్‌తో పాటు పలు ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. పలు చోట్ల విద్యత్ స్తంభాలు విరిగిపడటం, విద్యత్ తీగలు తెగిపోవడంతో మంగళవారం రాత్రి 10.30 గంటల నుండి విద్యత్ సరఫరా నిలిచిపోయింది. ప్రధాన అంతర్గత రహదారులు నీట మునిగాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్లలో నుండీ బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో వేలాది ఎకరాల్లో వివిధ దశల్లో ఉన్న వరి పంట నేల వాలింది. నీట మునిగింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్