ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : మండలంలో రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 మొదటి విడత పోలింగ్ ఈనెల 26వ తేదీ గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణలో భాగంగా బుధవారం గుడ్లవల్లేరు టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేసే విధానం, చేపట్టిన ఏర్పాట్లు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీకి చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గుమ్మా రమేష్ , మండల పరిషత్ అభివృద్ది అధికారి మహమ్మద్ ఇమ్రాన్ మరియు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
30 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 11:38 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)