ప్రజాశక్తి - కాండ్రేగుల : ప్రజా సంఘాలు బలపరిచిన హరిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాండ్రేగుల సదాశివ ఈరోజు హరిపాలెంలో ఇంటింటికి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది హరిపాలాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం సర్పంచ్ గా గెలిపించాలని ఆయన ప్రజలను ఓట్ల అభ్యర్థించారు ప్రజలందరూ కత్రి గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తానని, ఒక అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీలో రోడ్లు డ్రైనేజీ వీధిలైట్లు పారిశుధ్యం వంటి సమస్యలు పరిష్కారాలు కావాలంటే సదాశివను గెలిపించాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 3 వార్డు అభ్యర్థి కాండ్రేగుల బాబురావు, నాలుగో వార్డు అభ్యర్థి జరగడం మంగరత్నం,5 వార్డు సభ్యులు బొడ్డెడ రామ్ కుమార్ లు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి రొంగలి రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి మాణిక్యం, డిడి వరలక్ష్మి, కూoడ్రపు సోమునాయుడు, గంగిరెడ్డి నారాయణమ్మ, ఆర్ లక్ష్మి,,తదితరులు పాల్గొన్నారు .
హరిపాలెం సర్పంచ్ అభ్యర్థి సదాశివ ఇంటింటి ప్రచారం
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 12:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)