బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వివాహ వేదిక వద్ద కాల్పులు

16 నిమిషాల క్రితం

gun
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 11:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇద్దరు మృతి, మరో వ్యక్తికి గాయాలు

భోజ్‌పూర్ : బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బిబిగంజ్ గ్రామంలోని ఓ వివాహ వేదిక వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం, గుర్తుతెలియని దుండగులు బైక్‌పై వచ్చి వివాహ వేదిక వెలుపల ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి మాట్లాడుతూ.. "మేము బిబిగంజ్‌లో జరిగిన వివాహ ఊరేగింపులో పాల్గొనడానికి వెళ్లాము. అక్కడ ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, నేను గాయపడ్డాను" అని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాల్పులకు పాల్పడిన దుండగులు ఎవరు? ఈ ఘటనకు గల కారణాలేంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్