ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించండి

1 గంట క్రితం

Elect the CPM party candidates
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : స్థానిక ఎన్నికలలో సీఎం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సిపిఎం పార్టీ బృందం చల్లపల్లిలో ఆదివారం ఉదయం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చల్లపల్లి జడ్పిటిసి అభ్యర్థి యద్దనపూడి మధు సూదనరావు (మధు ), చల్లపల్లిలో రెండవ సెగ్మెంట్ ఎంపిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహమ్మద్ కరీముల్లాలకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చల్లపల్లి రాజా కళాశాల ఆవరణలోని ఉదయపు నడక మిత్రమండలి సభ్యులను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో అభ్యర్థులు యద్దనపూడి మధుసూదనరావు (మధు), మహమ్మద్ కరీముల్లా పార్టీ నాయకులు ఎం. పోలినాయుడు, ఒడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్