ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆశ్వయుజం

1 గంట క్రితం

Ashvayuja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంగిట్లోకి రాగానే

మేము పూలు ఏరుకోము

మా తరాల్ని ఏరుకుంటాం


తంగేడు -

ఎండకు ఎదురొడ్డి పూసిన

మా పసుపు ధైర్యం


గునుగు -

ఎంత చిదిమినా

తెల్లగా మిగిలే మా

అంతరంగం


బంతి -

ఒక పువ్వు కాదు

వందల చేతులు ఒక్కటై

కట్టిన పసిడి ముడి


చామంతి -

వాడిపోవడాన్ని కూడా

పండుగలా మార్చే మా

జీవన మెలకువ


గుమ్మడి పువ్వు -

నేల గర్భంలోంచి

ఆకాశాన్ని చూసే

విస్తరించిన మా కల


మా చేతుల్లో

పూలు పేర్చబడవు

ఒక్కో పువ్వు

ఒక జీవితపు జ్ఞాపకమై

బతుకమ్మ గా ఎదుగుతుంది

దాని చుట్టూ

కాలాన్ని తిప్పేది మా గొంతులే


ఈ తొమ్మిది సంధ్యలు

పూల పొరలు కావు

స్త్రీల సామూహిక జీవనోత్సవం


బతుకమ్మ ను

చెరువుకు అప్పగిస్తాం

పూలు నీటిలో కరిగి

మట్టిలో విత్తనమై

తరువాతి ఆశ్వయుజం కోసం

మళ్ళీ పూస్తాయి .


మండాది గోపీనాథ్ ,

9885045344

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్