బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనుమానంతో భార్యను చంపిన భర్త

22 గంటల క్రితం

Husband kills wife out of suspicion
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నులిమి చంపిన భర్త తనంతట తానుగా స్వయంగా పోలీసులకు లొంగిపోయిన ఉదంతం మచిలీపట్నంలో మంగళవారం జరిగింది. భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే అనుమానమే హత్యకు కారణంగా ... పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2024 లో పులిగడ్డకు చెందిన మండలి శ్రీరామ్ బందరు ఉత్తర మండలం జొన్నలవారిమోడీ గ్రామానికి చెందిన అడ్డాల విజయ రామ దుర్గాదేవిని పెళ్లి చేసుకున్నాడు. కారు డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీరామ్, ప్రైవేటు షాపులో టైపిస్టుగా పనిచేస్తున్న విజయ ఆర్ పేట పోలీస్ స్టేషన్ కి సమీపంలోని నివాసం ఉంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున భార్యాభర్తల మధ్య వివాదం జరిగడంతో ఆగ్రహంతో ఉన్న శ్రీరామ్ భార్యను గొంతు నులిమి చంపినట్లు పోలీసులు నిర్థారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ ఏసుబాబు పర్యవేక్షణలో మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై చాణక్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్