శనివారం, 12 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజమండ్రికి ఇండిగో విమానం మళ్లింపు

47 నిమిషాల క్రితం

IndiGo flight diverted to Rajahmundry.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 03:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కృష్ణా : ​ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షాల ప్రభావం విమాన సర్వీసుల పై పడుతోంది. చెన్నై నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి రావలసిన ఇండిగో విమానం శనివారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గన్నవరంలో ల్యాండ్ కాలేదు. రాజమండ్రికి విమానాన్ని మళ్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గన్నవరం పరిసర ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలు, మేఘావృతమైన వాతావరణం, తక్కువ కాంతి (దృశ్యమానత తక్కువగా ఉండటం) కారణంగా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుస్తు జాగ్రత్తగా విమానాన్ని రాజమండ్రి విమానాశ్రయానికి మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ​ఈ విమానంలో సుమారు 65 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నామని అధికారులు స్పష్టం చేశారు. రాజమండ్రిలో వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ పరిణామంతో చెన్నై - విజయవాడ ఇండిగో సర్వీసుల రాకపోకల్లో కొంత ఆలస్యం చోటుచేసుకుంది. సంబంధిత వివరాలను, తాజా సమాచారాన్ని ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్