మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సాగునీరు విడుదల చేయాలి

5 రోజుల క్రితం

puli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 01:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - పులిగడ్డ : సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గురువారం అఖిలపక్షాల రైతు సంఘాల నాయకులు పులిగడ్డలోని ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈని కలిసేందుకు వెళ్లారు. ఆయన లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ తో దివిసీమలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లి, డి ఈ బిబిఎస్ గణపతితో ఫోన్లో మాట్లాడి తక్షణమే దివిసీమ ప్రాంత రైతులను రక్షించేందుకు సాగునీరు విడుదల చేయాలని, ఆర్భాటంగా పసుపు కుంకాలు చల్లి సాగునీరు విడుదల చేశారని, రైతులు ధైర్యంగా సాగుకు వెళ్లవచ్చునని విధంగా ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ నీటిని వదలడంతో వాస్తవంగా భ్రమించిన రైతులంతా నారుమల్లు పోసుకున్నారు అన్నారు. ఇప్పుడు సాగునీరు ఇవ్వలేము, ప్రత్యామ్నాయ పంటల వైపు మల్లాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఇది రైతులను తీవ్ర నిరాశ పరుస్తుందన్నారు. అందువల్ల తక్షణమే సాగునీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. డి ఈ కార్యాలయం వద్ద కొంతసేపు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్టిడేటి వద్దకు వెళ్లి సాగునీరు విడుదలను పరిశీలించారు. అక్కడ సాగునీటి కోసం ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కోసూరి. శివ నాగేంద్ర, జిల్లా రైతు సంఘం నాయకులు ఆవుల. బసవయ్య, రైతు సంఘం నాయకులు రేపల్లె యోగ ప్రకాష్, ఏపీ రైతు కూలి సంఘం జిల్లా నాయకులు సింగోతు. నాగేంద్రం, ఏపీ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు జన్ను. జగన్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రైతు సంఘం నాయకులు చింత. వెంకట్ రాజు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి. మోహన్ రావు, సిపిఎం నాయకులు యద్దనపూడి. మధు, రైతు కూలీ సంఘం నాయకులు నడకుదుటి. నరసింహారావు, పీత. శ్రీహరి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యండి. కరిముల్లా, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్. రాజశేఖర్, కోడూరు రైతు సంఘం నాయకులు అప్పికట్ల జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్