ప్రజాశక్తి-మచిలీపట్నం అర్బన్ (కృష్ణా) : మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఉత్తర మండలం జనసేన పార్టీ ఎంపీపీగా కూనపురెడ్డి ప్రసాద్ శుక్రవారం ఉదయం మచిలీపట్నం జనసేన పార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. ఎంపీ వల్లభనేని బాలసౌరి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ తరపున కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ లు వివిధ హోదాలో ఉన్న జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బందరు ఉత్తర మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కూనపు రెడ్డి ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు.
బీఫారం అందుకున్న జనసేన పార్టీ ఎంపీపీ కూనపురెడ్డి ప్రసాద్
20 నవంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)