1,356 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్
ఉదయం 8 గంటల వరకు 11,882 మంది ఓటర్ల ఓటు
ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన 1,356 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ తెలిపారు. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు.
రెండో విడత ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని 128 గ్రామ పంచాయతీల్లో 1,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 3,07,582 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 11,882 మంది ఓటర్లు ఓటు వేసినట్లు జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.
మండలాల వారీగా పోలింగ్ వివరాలు:
చందర్లపాడు: 35,282 మంది ఓటర్లకు గాను 487 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 1.38.
జగ్గయ్యపేట: 54,845 మంది ఓటర్లకు గాను 4,553 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 8.30.
కంచికచర్ల: 52,687 మంది ఓటర్లకు గాను 2,937 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 5.57.
నందిగామ: 37,279 మంది ఓటర్లకు గాను 654 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 1.75.
పెనుగంచిప్రోలు: 38,080 మంది ఓటర్లకు గాను 1,753 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 4.60.
వత్సవాయి: 50,450 మంది ఓటర్లకు గాను 717 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 1.42.
వీరులపాడు: 38,959 మంది ఓటర్లకు గాను 781 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 2.00.
ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎస్. ఇలక్కియ సూచించారు.







కామెంట్‌లు (0)