పులివెందుల బాంబే బజార్‌లో ఘటన
తమిళనాడు నుంచి నెల రోజుల క్రితమే వలస వచ్చిన దంపతులు
ప్రజాశక్తి - పులివెందుల రూరల్:పులివెందుల పట్టణంలో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న బాంబే బజార్ మూడో అంతస్తులో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా మావటం గ్రామానికి చెందిన అయ్యప్ప, అముదగా గుర్తించారు. వివరాల ప్రకారం.. అయ్యప్ప, అముద దంపతులు నెల రోజుల క్రితమే పని కోసం తమిళనాడు నుంచి పులివెందులకు వచ్చారు. ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. దంపతుల మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతికి గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. దంపతుల మృతితో బాంబే బజార్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.







కామెంట్‌లు (0)