ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూసలపాడులో రిగ్గింగ్‌కు వచ్చినట్లు ఆరోపణలు.. 30 మంది పట్టివేత

10 నిమిషాల క్రితం

నంద్యాలకు చెందిన వారిని పట్టుకున్న గ్రామస్తులు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నంద్యాలకు చెందిన వారిని పట్టుకున్న గ్రామస్తులు

  • పోలీస్ స్టేషన్‌కు తరలించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు

ప్రజాశక్తి - బెస్తవారిపేట : పంచాయతీ ఎన్నికల సందర్భంగా రిగ్గింగ్ చేసేందుకు వచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మందిని గ్రామస్తులు పట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకు రిగ్గింగ్ చేసేందుకు నంద్యాలకు చెందిన 30 మంది వచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. వారిని గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకుని పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్