ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నంబూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

14 నిమిషాల క్రితం

822dcf99-c00d-4302-909c-ba8fa94ea40f.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 11:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కలెక్టర్, ఎస్పీతో కలిసి పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్ల పరిశీలన

  • ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు సూచన

ప్రజాశక్తి - తెనాలి : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెదకాకాని మండలం నంబూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా పరిశీలించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయి కాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి ఆయన పర్యటించారు. నంబూరు గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియ, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తును సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చేపట్టిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అధికారులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్