శుక్రవారం, 30 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బందర్‌లో వర్ష బీభత్సం

1 గంట క్రితం

bandaru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 30, 2026, 05:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మచిలీపట్నం అర్బన్ : మచిలీపట్నం నగరానికి జలగండం తప్పేటట్లు లేదు. మూడు రోజుల కిందట దంచి కొట్టిన అర్నాబ్ తుఫాను వర్షం ముంపు నుంచి బందరు నగరం బయటపడక ముందే శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం మరో దఫా బందరు వీధులను మోకాళ్ళ లోతు నీళ్లతో ముంచేసింది. కోనేరు సెంటర్, లక్ష్మీ టాకీస్ సెంటర్, బస్టాండ్ సెంటర్ ప్రాంతాలు వర్షపు నీటి ప్రవాహంతో నదులను తలపించాయి. బ్యాంకాక్ నగరంలో ప్రజలు పడవల మీద వెళ్లి వాళ్ళకు కావలసిన వస్తువులు కొనుక్కున్నట్లుగా ముందు ముందు బందరు లో కూడా ప్రజలు వాహనాలను పక్కనపెట్టి పడవలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం వస్తుందేమోనని ప్రజలు భయపడుతున్నారు. ద్విచక్ర వాహనాల సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్లి ముందుకు కదలక మొరాయిస్తున్నాయి. బస్సుల్లో బందరు బస్టాండుకు చేరుకుంటున్న ప్రయాణికులు బస్టాండ్ రేవు ఈదలేక మెయిన్ రోడ్డు మీద బస్సులు ఆపి దిగిపోతున్నారు.


నిలిచిన విద్యుత్‌ సరఫరా

వర్షాలు, జలమయమైన రోడ్లు కు తోడు ప్రజల కష్టాలు చాలవా! అన్నట్లు బందరు లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఫోన్ చార్జింగ్ కోసం, అత్యవసర సమాచారం పంపడం కోసం బందరులో ఏ ఏరియాలో కరెంటు ఉందో కనుక్కొని అక్కడ స్నేహితుల ఇళ్లకు పరిగెత్తడం పరిపాటి అయిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం అర్ధరాత్రి సైతం జిల్లా కలెక్టర్ వీధుల్లోకి వచ్చి విద్యుత్ సిబ్బందిని పర్యవేక్షించాల్సిన దారుణ పరిస్థితి నెలకొంది. మరో పక్క స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర కూడా విద్యుత్ శాఖ సిబ్బంది పని తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురిసిన వెంటనే మరలా విద్యుత్ సరఫరా ఆగిపోయినట్లు హౌసింగ్ బోర్డ్‌లో నివాసముంటున్న వారు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్