10 తులాల బంగారం, 3 కిలోల వెండి అపహరణ.
ప్రజాశక్తి - రైల్వేకోడూరు : రైల్వేకోడూరు పట్టణంలోని సీతారాంనగర్‌లో నివాసం ఉంటున్న ప్రణీత్ రెడ్డి ఇంటిలో గురువారం రాత్రి దొంగతనం జరిగింది. ఇంటిలో ఎవరూ లేని సమయంలో హెల్మెట్లు ధరించిన దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, 3 కిలోల వెండిని అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.







కామెంట్‌లు (0)