ఆక్లాండ్‌లో జరిగిన నాలుగో టీ20లో భారత్‌పై న్యూజిలాండ్ 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు మయాంక్ యాదవ్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (3)ను త్వరగానే పెవిలియన్‌కు చేర్చాడు. డారిల్ మిచెల్ (24) కాస్త దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించినా మయాంక్ ఔట్ చేశాడు. వెంటనే క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఫిన్ అలెన్ (31)తో కలిసిన (107: 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఫిన్‌తోపాటు జాకబ్స్ (7) త్వరగానే ఔటైనా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మైకెల్ బ్రాస్‌వెల్ (65: 25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కలిసి కేవలం 40 బంతుల్లోనే ఐదో వికెట్‌కు 115 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్ వరకూ ఆడిన ఫిలిప్స్ శతకం పూర్తి చేశాడు. కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. భారత బౌలర్లు మయాంక్ యాదవ్ 3.. అర్ష్‌దీప్, ప్రిన్స్, నితీశ్, అక్షర్ తలో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 87 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు సంజూ శాంసన్ (2 బంతులు), ఇషాన్ కిషన్ (3 బంతులు) స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయారు. అభిషేక్ శర్మ (27), శ్రేయస్ అయ్యర్ (22) కాసేపు పోరాడినప్పటికీ జట్టుకు అవసరమైన భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. నితీశ్ రెడ్డి 10 బంతుల్లో 21 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించాడు. అయినప్పటికీ వరుసగా వికెట్లు పడటంతో భారత్ 89 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ (35; 35 బంతుల్లో), నమన్ ధీర్ (28; 13 బంతుల్లో) జట్టును ఆదుకునేందుకు ప్రయత్నించిన ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాట్ ఫిషర్, మిచెల్ శాంట్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అద్భుత సెంచరీతో న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన గ్లెన్ ఫిలిప్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.







కామెంట్‌లు (0)