న్యూఢిల్లీ : ఐఆర్‌సిటిసి హోటల్స్ స్కామ్ కేసులో ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌కు ఉపశమనం లభించింది. మాజీ రైల్వే మంత్రి లాలూయాదవ్, ఆయనభార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీయాదవ్, సహా ఇతర కుటుంబసభ్యులపై ఈ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ అభియోగాలు నమోదు చేయడాన్ని ఢిల్లీ కోర్టు శుక్రవారం వాయిదా వేసింది. నవంబర్ 19 వరకు ఈ చర్యలను వాయిదా వేయాల్సిందిగా ఈడి అధికారులను ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ ఆదేశించారు. అయితే, ఉన్నత న్యాయస్థానం ఏదైనా ఉత్తర్వు ద్వారా మినహాయింపు ఇచ్చినా, స్టే మంజూరైన వారు తప్ప మిగిలిన వారందరూ తదుపరి విచారణ తేదీ నాటికి హాజరుకావాలని ఆదేశించారు.
IRCTC scam case : ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూకి ఉపశమనం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 30, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)