శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం- స్వామి దాస్

1 గంట క్రితం

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం- స్వామి దాస్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -తిరువూరు

వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని వైసిపి తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరువూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం శనివారంతో 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా స్వామిదాస్ మాట్లాడుతూ.. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీలకు పోస్టులు ఇవ్వాలని, గ్రేడ్-2 సెక్రటేరియట్ కింద ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కాలసాని నాగేశ్వరరావు, వెలుగోటి ఆదినారాయణ, పరసా శ్రీనివాసరావు, నెహ్రూ, రామవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్