ఆదివారం, 11 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపట్టిసీమతో రూ.50 వేల కోట్ల సంపద సృష్టి

1 రోజు క్రితం

Nimmala Ramanaidu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 09:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర రైతాంగానికి వరప్రదాయినిగా మారిందని, రూ.50 వేల కోట్ల సంపద సృష్టించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, అపార అనుభవానికి సజీవ సాక్ష్యమని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు, ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్లతో అమరావతి సచివాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2015 నుంచి ఇప్పటి వరకు 500 టిఎంసిల గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా సుమారు రూ.50 వేల కోట్ల సంపద సృష్టించబడిందని వివరించారు. రూ.1,600 కోట్ల వ్యయంతో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు అత్యధిక ఫలితాలిచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత ‘సూపర్ ఎల్ నినో’ విపత్కర పరిస్థితుల్లో సైతం గోదావరి నుంచి 57 టిఎంసిల నీటిని తరలించి కృష్ణా డెల్టాలో సుమారు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడటంతో పాటు 30 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చిందని తెలిపారు. ఈ సమావేశంలో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ డి వెంకటేశ్వరరావు, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ ఎమ్ మురళీధరరావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్లు ఎమ్ భోగేశ్వరరావు, తుమ్మల జగదీష్, కొమ్మారెడ్డి రాజేష్ పాల్గొన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్