శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబతుకమ్మ పండుగ రోజు విషాదం

1 గంట క్రితం

death
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఇద్దరు పిల్లలతో బావిలో దూకి వివాహిత ఆత్మహత్య

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : ​దంపతుల మధ్య జరిగిన గొడవ మూడుప్రాణాలను బలిగొంది. స్థానికులు, కురవి ఎస్‌ఐ సతీష్ కథనం మేరకు... మహబూబాబాద్‌ ‌జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం బాలపాల శివారు లింగ్యతండాకు చెందిన బానోత్ నవీన్, అనూష (35) దంపతులకు విశాల్ కృష్ణ (9), వర్షిణి (5), పాప (2) ముగ్గురు పిల్లలు ఉన్నారు. శనివారం దంపతుల మధ్య గొడవ జరడంతో మనస్థాపం చెందిన అనూష క్షణికావేశంలో తన ఇద్దరు పిల్లలు విశాల్ కృష్ణ, వర్షిణిని తీసుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం ఎవరూ చూడకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటికే వారు మృతి చెందారు. బావి వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను వెలికి తీశారు. కురవి ఎస్‌ఐ సతీష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చర్చనీయాంశమైంది. క్షణికావేశంలో ఆత్మహత్యలు వద్దని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, పోలీసులు ఎంత ప్రచారం నిర్వహించినప్పటికీ అవి గ్రామీణ ప్రజలకు చేరడం లేదు. దీంతో దంపతుల వివాదాల మధ్య అభంశుభం తెలియని పసిపిల్లలు బలవుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్