శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దసరా కాంతులతో కొండలమ్మ ప్రాంగణం

1 గంట క్రితం

దసరా కాంతులతో కొండలమ్మ ప్రాంగణం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

దసరా శరన్నవరాత్ర మహోత్సవాలకు జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన వేమవరం శ్రీ కొండలమ్మ తల్లి అమ్మవారి ఆలయం విద్యుద్దీపాలతో శోభాయమానంగా మారిపోయింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఈడే వెంకట విష్ణు మోహన్‌రావు, ఈఓ ఆకుల కొండలరావు, ధర్మకర్తల ఆధ్వర్యంలో ప్రధాన ఎంఎన్‌కే రహదారిపై ఆలయం వారు ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గా దేవి విద్యుద్దీపాల కటౌట్‌ భక్తులు, ప్రయాణికుల్ని ఆకట్టుకుంటుంది. ఆ మండపానికి కాంతులు, అమ్మవారి కార్యాలయం, షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు విద్యుద్దీపాలు, అమ్మవార్ల ప్రతిమలు, అనివేటి మండపాలతో పాటు తల్లి సన్నిధి రంగు రంగుల విద్యుద్దీపాల కాంతులీనుతున్నాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్