ప్రజాశక్తి -నందిగామ
నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సీజీఎఫ్ నిధులు రూ.1.40 కోట్లతో నిర్మించనున్న రెండు కమ్యూనిటీ భవనాలకు శనివారం శంకుస్థాపన చేశారు. బిసి ఒడియా రాజుల కాలనీతో పాటు రామాలయం వద్ద ఒక్కొక్కటి రూ.70 లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఒకేసారి రూ.1.40 కోట్లతో రెండు కమ్యూనిటీ భవనాలకు శ్రీకారం చుట్టడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)