ప్రజాశక్తి-గన్నవరం
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కేసరపల్లిలో శనివారం చోటు చేసుకుంది. పొలీసులు కథనం ప్రకారం.. గ్రామంలోని సిలువ బొమ్మ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొనడంతో ఆమె అక్కడకిక్కడే మృతి చెందారు. మహిళ చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడు. మృతురాలి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గన్నవరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








కామెంట్‌లు (0)