ప్రజాశక్తి-అవనిగడ్డ
అవనిగడ్డ జడ్పిటిసి స్థానానికి పోటాపోటీ నామినేషన్లు వేశారు. అవనిగడ్డ జడ్పిటిసి స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో కూటమినుండి ఆశవహుల సంఖ్య ఎక్కువయింది. టిడిపి నియోజకవర్గ ఇన్ ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు సతీమణి విక్కుర్తి జయలక్ష్మి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అవనిగడ్డ నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా వైసిపి తరపున మాజీ జడ్ పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ (లచ్చి) సతీమణి చింతలపూడి శ్రీలక్ష్మి నామినేషన్ వేశారు. మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ను కలిసి అక్కడ నుండి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నుండి వేకనూరు మాజీ సర్పంచ్ తుంగల శ్రీలక్ష్మి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా బందులాయి చెరువు గ్రామానికి చెందిన గోరుముచ్చు శైలజలు జడ్ పిటిసి అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.









కామెంట్లు (0)