శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మోటూరులో 20 మందికి బైండోవర్

14 నిమిషాల క్రితం

మోటూరులో 20 మందికి బైండోవర్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడివాడ రూరల్‌

రాబోయే జడ్ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు గుడివాడ రూరల్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోటూరు గ్రామంలో నేర చరిత్ర కలిగిన, నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న 20 మందిని గుర్తించి బైండోవర్‌ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల పూచీకత్తు తీసుకుని మండల ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలు, హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా గ్రామస్తులు శాంతియుతంగా ఉండాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, హింసాత్మక ఘటనలకు పాల్పడినా, ఇతరులను ప్రేరేపించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని గుడివాడ రూరల్‌ ఎస్సై ఎన్‌. చంటిబాబు, పోలీసు సిబ్బంది హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్