హైదరాబాద్: సైబర్ సిటి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కొండాపూర్‌లో చేపట్టిన ప్రీమియం నివాస ప్రాజెక్టు ‘సైబర్ సిటి ట్రెవిటా’ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణ ప్రమాణాలు, సాంకేతిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు. 75 శాతం పచ్చదనం, 60,000 చదరపు అడుగుల్లో ఐదు అంతస్తుల క్లబ్‌హౌస్, రూఫ్‌టాప్ స్కైలైన్ డెక్, 37 ల్యాండ్‌స్కేప్ సదుపాయాలతో నివాసితుల కోసం విలాసవంతమైన వసతులను ఇందులో తీర్చిదిద్దినట్లు తెలిపారు. భద్రత, సాంకేతికత కోసం ప్రతీ టవర్‌లో బయోమెట్రిక్ భద్రత, రోబోటిక్ పార్శిల్ డెలివరీ వ్యవస్థలను పరిచయం చేస్తున్నామన్నారు. ఆర్కిటెక్చర్, డిజైన్, టెక్నాలజీ కలయికతో హైదరాబాద్ మార్కెట్లో ఇప్పటివరకు చూడని నిజమైన విలాసవంతమైన జీవన అనుభూతిని ట్రెవిటా అందిస్తుందన్నారు.
కొండాపూర్‌లో సైబర్ సిటి ట్రెవిటా ప్రాజెక్టు
13 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 23, 2026, 09:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)