ప్రజాశక్తి -పిఠాపురం
పురపాలక సంఘం పిఠాపురం వైసిపి చైర్మన్ అభ్యర్థి పెదపాటి రాజేష్ కుమార్ శుక్రవారం మున్సిపల్ పరిధిలోని జగ్గయ్యచెరువు కాలనీ వార్డుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థులు నల్లమిల్లి సరళరత్నం, చింతాడ నీలవేణి, రామినీడి వీరమణితో కలిసి ఇంటింటికీ వెళ్ళి గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. రాజేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో తమ ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ప్రజలంతా కూటమి పాలనపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.







కామెంట్‌లు (0)