ప్రజాశక్తి-గన్నవరం
గన్నవరం 4వ సెగ్మెంట్‌లో సిపిఎం అభ్యర్థి గుండిమెడ ఉదయభాస్కర్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాంనగర్ ప్రాంతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుపై ఓటు వేసి ఉదయభాస్కర్‌ను గెలిపించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల పార్టీ నాయకులు అనుమోలు వెంకటేశ్వరరావు, సూరగాని సాంబశివరావు, మిరప నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)