సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎంసిఎంసి విభాగాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

1 గంట క్రితం

ఎంసిఎంసి విభాగాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 09:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుంటూరు

స్థానిక ఎన్నికల్లో భాగంగా స్థానిక బ్రాడీపేటలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్‌ మానిటరింగ్ (ఎం.సి.ఎం.సి) కమిటీ విభాగాన్ని సాధారణ పరిశీలకులు వీరబ్రహ్మయ్య, వ్యయ పరిశీలకులు నందిని సలారియా సోమవారం పరిశీలించారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, ప్రీ సర్టిఫికేషన్ అంశాలను పక్కాగా పరిశీలించాలని ఆదేశించారు. అన్ని చానళ్లలో ప్రసారాలను విధిగా పరిశీలించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారాలకు విధిగా ముందస్తు అనుమతులు పొందాలని, అనుమతులు లేకుండా ప్రసారాలు జరుగుతుంటే వాటిని గమనించాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా వాటి వ్యయాలను నమోదు చేయాలని చెప్పారు. సంబంధిత వ్యయ బృందాలకు, రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, ఎం.సి.ఎం.సి విభాగం పనితీరును వివరించారు. ఇప్పటి వరకు ఫ్రీ సర్టిఫికేషన్ క్రింద ఏడు అనుమతులు జారీ చేసినట్లు చెప్పారు. పెయిడ్ న్యూస్, ప్రకటనలు, వివిధ ఎలక్ట్రానిక్, డిజిటల్ ఛానళ్లలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను 24 గంటలు పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎ.వి.ఎస్‌.రవీంద్ర, సహాయ కార్యనిర్వహక ఇంజినీర్ ఎ.కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్