సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కండక్టర్‌‌ ప్రవళికను పరామర్శించినఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ నేతలు

1 గంట క్రితం

కండక్టర్‌‌ ప్రవళికను పరామర్శించినఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ నేతలు
ప్రజాశక్తి - హైదరాబాద్  బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో​

ప్రయాణికురాలి దాడిలో కాలికి గాయమై హైదరాబాద్‌లోని సాయి సంజీవని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణుగూరు డిపో కండక్టర్ ప్రవళికను ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర నాయకత్వం పరామర్శించింది. ఈ సందర్భంగా ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ ప్రచార కార్యదర్శి పి రవీందర్ రెడ్డి తదితర నాయకులు ప్రవళికను కలిసి, దాడి ఘటనకు సంబంధించిన వివరాలను, ఆమె ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న డాక్టర్‌ను కలిసి ప్రవళికకు అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రవళికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడినట్టు నాయకులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ కష్ట సమయంలో ప్రవళికకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణే కాదు, ఆపదలో ఉన్న కార్మికులకు అండగా నిలవడంలోనూ ఎస్‌‌డబ్ల్యుఎఫ్‌ ముందుంటుందని చెప్పారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్