సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైడ్రో పవర్‌ ప్లాంట్‌ సర్వే పనులు అడ్డగింత

1 గంట క్రితం

హైడ్రో పవర్‌ ప్లాంట్‌ సర్వే పనులు అడ్డగింత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 09:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ నగరంపాలెం వద్ద అదాని హైడ్రో పవర్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు కోసం సర్వే నిమిత్తం వచ్చిన వారిని సోమవారం ఆదివాసీలు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపించేశారు. ఇప్పటికే పలుమార్లు సర్వే, మట్టి పరీక్షల కోసం వచ్చిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకుని పంపించేస్తున్నా కొద్ది నెలల వ్యవధిలో మళ్లీ మళ్లీ వారు ఇక్కడకు వస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అదాని కంపెనీ ప్రతినిధుల వైఖరిని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి వెంకన్న తీవ్రంగా ఖండించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజనులు నివసిస్తున్న చోట అదాని హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని, సర్వేల పేరుతో వేధించడం, బెదిరింపులకు పాల్పడడం దారుణమన్నారు. తీరు మార్చుకోకుంటే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్‌ ‌నిర్మిస్తే కోణాం రిజర్వాయర్‌‌కు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గిరిజనుల జీవన విధానానికి ఇబ్బందులు తలెత్తుతాయని, బొడ్డగుమ్మి గెడ్డపై పవర్ ప్లాంట్ నిర్మాణం జరిగితే కోణాం రిజర్వాయర్‌కు క్యాచ్‌‌మెంట్‌ ఏరియాగా ఉన్న గెడ్డలు ఎండిపోతాయని, ప్రాజెక్టుకు జీవ నదిగా ఉన్న బొడ్డగుమ్మి గెడ్డ పూర్తిగా ఎండి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్‌ నిర్మించరాదని డిమాండ్‌ ‌చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు.

​

​

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్