సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘బ్రిక్స్’వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తాం - స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌

1 గంట క్రితం

‘బ్రిక్స్’వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తాం
- స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌
ప్రజాశక్తి - హైదరాబాద్  బ్యూరో image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో

బ్రిక్స్ సమావేశాల్లో తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ అన్నారు. 26, 27 తేదీల్లో ఢిల్లీలోని పార్లమెంట్‌ ‌సెంట్రల్‌‌హాల్‌‌లో జరిగే 12వ బ్రిక్స్‌ ‌పార్లమెంటరీ ఫోరం సమావేశాలకు హాజరయ్యేందుకు మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌‌రెడ్డితో కలిసి స్పీకర్‌ ‌సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో స్పీకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను బ్రిక్స్‌ సమావేశాల్లో వివరిస్తామని తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, ఇండోనేషియా, యుఎఇ దేశాల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్