ప్రజాశక్తి-గుడివాడ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గుడివాడలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం పరిశీలించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను, పరిసర ప్రాంతాల్లో పోలీసుల గస్తీని ఎన్నికల అధికారి మనోహర్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ పురపాలక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల భద్రత కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా, ప్రజలు భయాందోళనలకు గురికాకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు ఆయన వివరించారు.







కామెంట్‌లు (0)