ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ.

6 రోజుల క్రితం

చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ. image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-మచిలీపట్నంఅర్బన్

కార్మిక హక్కుల సాధన కోసం డిసెంబర్ 1 ఢిల్లీని ఆక్రమిద్దాం కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ )కృష్ణా జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సోమవారం మున్సిపల్ కార్మికులతో కలిసి గోడపత్రిక ను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోయిన రిటైర్మెంట్ అయిన కార్మికుల ప్లేసులో వారి ఫ్యామిలీ మెంబర్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ మచిలీపట్నం అధ్యక్షురాలు సిహెచ్ బుల్లెమ్మ ప్రధాన కార్యదర్శి శిరం శెట్టి దుర్గ ప్రసన్నడు, సిహెచ్ జయరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మచిలీపట్నం శివగంగ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ లు కరపత్రాలు పంపిణీ చేశారు. మచిలీపట్నం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బి అంక బాబు,మొహమ్మది,మండల కమిటీ సభ్యులు కంచర్లపల్లి వెంకటేశ్వరరావు,రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్