ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేవీకేలో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

6 రోజుల క్రితం

కేవీకేలో ఘనంగా రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 07:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-ఘంటసాల

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థ బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శనను నిర్వహించారు. గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సదస్సులో శాస్త్రవేత్తలు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల యాజమాన్యం, సమగ్ర పోషక, నీటి వనరుల సమర్థ వినియోగం, సుస్థిర వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రదర్శనలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ నమూనాలు, వినూత్న సాగు పద్ధతులపై విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను తెలుసుకుంటూ, విజ్ఞాన మార్పిడికి ఈ కార్యక్రమం చక్కని వేదికగా నిలిచింది. కార్యక్రమంలో ఘంటసాల కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా. డి. సుధారాణి, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ప్రతినిధి డా. వై. సునీత, ఘంటసాల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. ఎన్. హరి సత్యనారాయణ, వ్యవసాయ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. వి. విశాలాక్షి, భూసార శాస్త్ర విభాగాధిపతి డా. ఎం. లత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ. లలిత, కేవీకే ఎస్ఎంఎస్‌లు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్