మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రవాణా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

6 రోజుల క్రితం

ప్రజాశక్తి ఉయ్యూరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 07:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఉయ్యూరు

ఉయ్యూరులోని కామ్రేడ్‌ మానికొండ సుబ్బారావు, సూర్యవతి శ్రామిక భవనంలో సోమవారం ఉయ్యూరు టాక్సీ డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సర్వసభ్య సమావేశం యూనియన్‌ అధ్యక్షుడు ఎండీ మౌలా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి ఎం. పోలినాయుడు మాట్లాడుతూ రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ గ్యాస్‌, ఇన్సూరెన్స్‌ ధరలు పెరుగుతుండటంతో కార్మికులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ధరలను నియంత్రించి రవాణా రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పట్టణాల్లో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ట్రాన్స్‌పోర్ట్‌ స్టాండ్లు ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, నీరు, అడవులు, భూమిపై ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్‌ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్‌ మార్చ్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ పోరాటానికి మద్దతుగా మండల కేంద్రంలో నిరసనలు, ర్యాలీలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఉపాధ్యక్షుడు బి. వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు మొన్న రఫీ, షరీఫ్‌, రవి, కొండలరావు, రాము, శ్రీనివాసరావు, జబ్బార్‌, పుకార్‌, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్