ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని పినపళ్ల పరిధిలో ఓఎన్‌జీసీ సైట్‌లో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ... మండలంలోని పెదపళ్ళకు చెందిన వాసా శివరాం (30) పశువులకు పచ్చగడ్డి కోసుకు వచ్చే నిమిత్తం సోమవారం సాయంకాలం సమయంలో పినపల్ల ఓఎన్జిసి సైట్‌లోకి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి ఓఎన్జిసి రిగ్ నుంచి వచ్చే వ్యర్థాలు, రసాయనాలు నిల్వ ఉండే చెరువులో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి పొద్దు పోవడంతో ఎంతకీ రాకపోవడంతో యువకుడు కోసం వెతుకులాటలో భాగంగా చెరువులో పడిపోయినట్లు గుర్తించారు. దీంతో వారంతా స్థానికుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా, సోమవారం రాత్రి 11 గంటల సమయంలో మృతదేహం లభ్యమైంది. భార్యకు నాలుగు రోజుల క్రితమే డెలివరీ అయిందని బాబు పుట్టాడని భర్తకు ఈ విషయం ఇంకా తెలియదని మంగళవారం కుటుంబ సభ్యులు ఆవేదనతో తెలిపారు. ఈ ఘటనతో స్థానిక గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రమాదవశాత్తూ రసాయనాల చెరువులో పడి యువ రైతు మృతి
26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 04:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)