ప్రజాశక్తి-అవనిగడ్డ
అవనిగడ్డ మండల లీగల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోక్సో చట్టంపై శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా అదనపు న్యాయమూర్తి పాండురంగారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ ఎన్. శివశంకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎజిపి బొప్పన సుబ్రహ్మణ్యేశ్వరరావ్, అవనిగడ్డ కోర్టుల మీడియేటర్స్ కె. ఈశ్వరరావు, తోట వీరబాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)