శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూడు గ్రామాల్లో సర్పంచుల ఏకగ్రీవాలు

6 రోజుల క్రితం

మూడు గ్రామాల్లో సర్పంచుల ఏకగ్రీవాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు

మండలంలోని మూడు గ్రామాల్లో సర్పంచుల ఏకగ్రీవాలు శనివారం జరిగాయి. గుడ్లవల్లేరులో సర్పంచి కూతాడి దుర్గతో పాటు 12వార్డు మెంబర్లు ఏకగ్రీవాలయ్యాయని అధికారులు తెలిపారు. అలాగే కట్టవానిచెరువులో సర్పంచి అబ్దుల్‌ కరీంతో పాటు ఎనిమిది మంది వార్డుమెంబర్లు, గ్రామ ఉప సర్పంచి ఈడే అమలజ్యోతి ఏకగ్రీవమయ్యారు. గాదేపూడిలో మదిరి ఆంజనేయులు ఏకగ్రీవ సర్పంచిగా, ఆరుగురు వార్డుమెంబర్లు ఎన్నికయ్యారు. ఉప సర్పంచిగా అప్పినీడి శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈఆర్‌ఎమ్‌ విద్యా సంస్థల చైర్మన్‌ వల్లభనేని వెంకట్రావు, మాజీ జెడ్ పిటిసి కొసరాజు బాపయ్యచౌదరి, ఎఎంసి చైర్మన్‌ పొట్లూరి రవికుమార్, టిడిపి మండలాధ్యక్షులు పోలవరపు వెంకట్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వల్లభనేని రంగబాబు, కొండలమ్మ దేవస్థాన చైర్మన్‌ ఈడే మోహన్, సూరపనేని పరంధామయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్