ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వచ్ఛతలో గిద్దలూరు ఏరియా ఆసుపత్రికి ప్రథమ స్థానం

03 అక్టోబర్, 2026

award.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’లో ఉత్తమ ప్రతిభ..

  • స్వచ్ఛ ఆంధ్ర అవార్డుకు ఎంపిక

ప్రజాశక్తి - గిద్దలూరు : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర (సాస) కార్యక్రమం–2026లో గిద్దలూరు ఏరియా ఆసుపత్రి ఉత్తమ ప్రతిభ కనబరిచింది.మార్కాపురం జిల్లా పరిధిలో నిర్వహించిన పరిశీలనలో ఆసుపత్రి ప్రథమ స్థానాన్ని సాధించింది.

ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను అధికారులు పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై కూడా తనిఖీలు చేశారు. స్వచ్ఛతకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించారు. అన్ని అంశాల్లో ఆసుపత్రి మెరుగైన పనితీరు కనబరిచినట్లు అధికారులు గుర్తించారు. దీంతో గిద్దలూరు ఏరియా ఆసుపత్రి ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డుకు ఎంపికైంది.

కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు

శుక్రవారం రాత్రి మార్కాపురంలో జరిగిన ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆదాం అవార్డును మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా అందుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సమష్టి కృషితోనే ఈ గుర్తింపు సాధ్యమైందని డాక్టర్ ఆదాం పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో గిద్దలూరు ఏరియా ఆసుపత్రి ప్రథమ స్థానం సాధించడం పట్ల ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్