ప్రజాశక్తి–మార్కాపురం: మార్కాపురం డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పుట్టపర్తి డీఎస్పీగా పనిచేసిన ఆయన మార్కాపురానికి బదిలీపై వచ్చారు. గతంలో మార్కాపురం డివిజన్లో పెద్దారవీడు ఎస్ఐగా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ సత్యనారాయణ మాట్లాడుతూ మార్కాపురం సబ్డివిజన్లో శాంతిభద్రతలను మెరుగుపరిచేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
మార్కాపురం డీఎస్పీగా నిమ్మగడ్డ బాధ్యతలు
03 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 03, 2026, 01:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)