సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధిక ధరల దోపిడీని అరికట్టాలి : సిపిఎం నిరాహారదీక్ష

16 గంటల క్రితం

Exploitation through high prices must be curbed: CPM hunger strike
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 05:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విజయవాడ : ఇళ్లు లేని పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా... పేదలకు పట్టాభిషేకం అనే మాటకు అర్థం లేదు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు అన్నారు. అధిక ధరల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ .... పాతబస్తీ ,50వ డివిజన్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఐ(యం) ఆధ్వర్యంలో ఆదివారం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ .... ఎన్నికలు వస్తే కానీ ఇళ్ల పట్టాలు కూటమికి గుర్తు రాలేదా ? అని ప్రశ్నించారు. ఐదు దశాబ్దాల నుండి నివాసం ఉంటున్న పేదలకు... పట్టాల మంజూరులో నిబంధనల సాకులు ఎందుకు ? అని అడిగారు. ఇల్లు లేని వారికి రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి పట్టాభిషేకం చేయాలన్నారు. బడా బాబులకు వారంలోనే స్థలాలు కేటాయించి, పట్టాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్లు చేసి రుణాలు మంజూరు చేసే పాలకులు... సామాన్యులకు ఎందుకు చేయలేరు అని అడిగారు. కొండ ప్రాంత పేదల ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు పక్కా ఇల్లు నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలన్నారు. నగర అభివృద్ధికి, కొండ ప్రాంతాల మెరుగుకు ఐదువేల కోట్ల రూపాయల ప్రత్యేక నిధి విడుదల చేయాలన్నారు. నగర అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. కమ్యూనిస్టుల పరిపాలనలో పన్నులు భారాలు పెంచకుండా, నగర అభివృద్ధికి కృషి చేశాయన్నారు. రాబోయే నగరపాలక సంస్థ ఎన్నికల పోరాటానికి కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ బి.సత్యబాబు మాట్లాడుతూ .... అధిక ధరలను అరికట్టాలని, రేషన్ డిపో ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలన్నారు. 50 డివిజన్ గొల్ల పాలెం గట్టు పరిధిలో మంజూరైన రిట్తెనింగ్ వాల్ నిర్మించాలన్నారు. ముంపు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇల్లు లేని పేదలకు రెండు సెంట్లు ఇల్లు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇవ్వాలని కోరారు. విజయవాడ నగరంలో 19 రోడ్లను కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తున్నదన్నారు. పన్నుల భారాలు పౌర సేవలను ప్రైవేటీకరణ చేసే జిఒ 673 ని రద్దు చేయాలన్నారు. విజయవాడ ప్రజల పన్నులను ప్రభుత్వం పక్కదారి పట్టించి నగర అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నదన్నారు. ప్రమాదకరంగా ఉన్న కొండ ప్రాంతాల రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని లేకపోతే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఆదిలక్ష్మి, నగర కమిటీ సభ్యులు ఎం. కొండారెడ్డి, పి రాజు, శంకర్, దుర్గారావు, శివ, మహేష్, వి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్