ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపు
ప్రజాశక్తి – విజయవాడ : విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్‌లో ఉన్న చైతన్య స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యమే ఎన్నికలకు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకోవడంతో చైతన్య స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది.







కామెంట్‌లు (0)