విజయవాడ : పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ ... ఐద్వా నగర కమిటీ ల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కె. సరోజ మాట్లాడుతూ .... బియ్యం, పప్పు ధాన్యాలు, నూనె ధరలు, ఉల్లిపాయలు, గుడ్లు వంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయాలు పెరగడం లేదని, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సరిగ్గా ఆహారం లేక పౌష్టికాహార లోపంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి 14 రకాల నిత్యావసర సరుకుల ను రేషన్ డిపోలలో ఇవ్వాలని, బ్లాక్ మార్కెట్ ను అరికట్టి ధరలను నియంత్రించి సామాన్యులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సెంట్రల్ సిటీ కార్యదర్శి జి. ఝాన్సీ, ఈస్ట్ సిటీ కార్యదర్శి రత్న మాల, ఆదిలక్ష్మి, అరుణ, పిచ్చమ్మ, రమ, దుర్గ , లక్ష్మి, శివమ్మ, ఉష పాల్గొన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి : ఐద్వా
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)