సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ నిర్వాసితుల ఆందోళన ఉద్రిక్తం - పోలీసుల లాఠీచార్జ్

54 నిమిషాల క్రితం

Protest by Veligonda project-displaced persons turns tense.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట వెలిగొండ నిర్వాసితులు సోమవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ .... సిపిఎం ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమానికి నిర్వాసితులు యత్నం చేశారు. ఈ వంటావార్పును పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించిన నిర్వాసితులు ఆందోళన చేశారు. ఇళ్ల స్థలాలు, పరిహారం, పునరావాస సౌకర్యాలు వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సోమయ్య, రూబెన్ పై పోలీసులు దాడి చేసి వారిని అరెస్టు చేశారు. వారిని పెద్దారవీడు పోలీస్ స్టేషన్లో దాచినట్లు సమాచారం. నిర్వాసితులపై మానవత్వాన్ని మరిచి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. శాంతియుతంగా తమకు న్యాయం చేయాలని, పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్న వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల మానవత్వాన్ని మరిచి మార్కాపురం పోలీసులు కర్కశంగా వ్యవహరించారు. సిపిఎం నేత సోమయ్య ను రోడ్డు పై ఈడ్చుకెళ్లారు.. ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి చొక్కా కాలర్లను పట్టుకొని బలవంతంగా ఆటోలలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.


Protest by Veligonda project-displaced persons turns tense.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్