సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మిక్ కాలేజీలో విద్యార్థుల ఫైట్ - 11 మంది సస్పెండ్

1 రోజు క్రితం

Student clash at MIC College – 11 suspended.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 01:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్టిఆర్) : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల సమీపంలో ఉన్న మిక్ (MIC) కాలేజీలో సీనియర్లు, జూనియర్ల మధ్య శనివారం ఘర్షణ తలెత్తింది. కాలేజీ ప్రాంగణంలోనే ఇరు గ్రూపుల విద్యార్ధులు దాడికి దిగారు. సినిమా ఫైట్లు, పిడి గుద్దులు గుద్దుకున్నారు. విషయం తెలుసుకున్న కాలేజి యాజమాన్యం దాడులకు దిగిన ఇరు వర్గాల విద్యార్థులను పిలిచి మందలించింది. ఓ అమ్మాయి విషయంలో సీనియర్స్, జూనియర్స్ మధ్య ఘర్షణ రాజుకున్నట్లు సమాచారం. దీంతో దాడులకు దిగిన ఇరు వర్గాలకు చెందిన 11 మంది విద్యార్ధులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఘర్షణకు పాల్పడినవారిపై కళాశాల యాజమాన్యం కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్