పాయికాపురం, శాంతినగర్, 82వ డివిజన్ లో, 6 వ బూత్ లో ఓటు వేసిన బాబురావు
#ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.....
ధన రాజకీయాలు, అధికార దుర్వినియోగంతో స్థానిక ఎన్నికలలో ప్రజాస్వామ్యానికి పాతర వేసిన కూటమి, అదే దారిలో వైసిపి కూడా నడుస్తోందని సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అధికారంలోకి వచ్చిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. విజయవాడతో సహా రాష్ట్రంలో విచ్చలవిడిగా కొట్లాది రూపాయలతో కూటమి నేతలు ఓట్లు కొనుగోలు చేయటం దుర్మార్గం అని అన్నారు. ఎన్నికలలో డబ్బును తిరస్కరించాలని గతంలో మహిళలకు పిలుపునిచ్చిన చంద్రబాబు, కూటమి ధన రాజకీయాలతో వ్యవస్థలను కలుషితం చేయటం శోచనీయం. అభివృద్ధి, తమ పాలన చూసి జనం ఓట్లు వేస్తారని చెప్పిన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి... డబ్బు మీదే ఆధారపడటం వారి నైతిక ఓటమికి నిదర్శనం. డబ్బు రాజకీయాలను తిరస్కరించండి అని ఎన్నికలలో చెప్పే ధైర్యం కూటమి నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. విజయవాడ ఎన్నికలలో కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించలేని దుస్థితిలో కూటమి, వైసీపీలు ఉన్నాయి. విజయవాడ నగరానికి ఏమి చేశారు? ఏమి చేస్తారు? చెప్పగలిగే ధైర్యం కూటమి ప్రభుత్వానికి, నేతలకు లేదు. విజయవాడ ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికి సానుకూల సంకేతాన్ని ఇవ్వాలి, ప్రత్యామ్నాయ రాజకీయాలకు పునాది పడాలి. మేయర్ గా ఏబి. వెంకటేశ్వరరావు గారు, కార్పొరేటర్ గా కమ్యూనిస్టు, మిత్రుల అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వాల విధానాల బండారాన్ని, నగరాభివృద్ధి, ప్రజా సమస్యల ఎజెండాని ముందుకు తేవడంలో కమ్యూనిస్టు, కాంగ్రెస్, ఏబీవీ ముందు పీఠిన నిలిచి, ఇప్పటికే నైతిక విజయం సాధించారు. ధరలు, పన్నుల భారాలు, నగరపాలక సంస్థ వైఫల్యాలపై ప్రజాగ్రహాన్ని దృష్టి మళ్లించడానికి విచ్చలవిడిగా డబ్బు పంపిణీకి కూటమినేతలు పూనుకోవటం సిగ్గుచేటు. విజ్ఞతతో, చైతన్యంతో ధన రాజకీయాలను తిప్పికొడతారని ఆశిస్తున్నాం’







కామెంట్లు (0)